Share News

అలసత్వం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:39 AM

టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయ ని వ్యవసాయాశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అధికారులను హెచ్చరించారు.

అలసత్వం వహిస్తే చర్యలు
సమీక్షలో ఆధికారులతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • అధికారులతో సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయ ని వ్యవసాయాశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అధికారులను హెచ్చరించారు. గురువారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేష న్‌, రహదారులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ శాఖల డీఈలు, ఏఈ లు, ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిం చారు. అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకు న్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి గ్రామానికి రహదారు లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సాగునీటి అందుబాటుపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా ప్రణాళికాబద్ధగా సాగాలని అధి కారులకు సూచించా రు. కాలువల్లో పేరు కుపోయిన పూడికను తొలగించే పనులను వేగవంతం చేసి, నీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ఆదే శించారు. పాకివ లస నుంచి కొత్తపల్లి వరకు జరుగుతున్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యల పరిష్కారంపై కూడా మంత్రి అధికా రులకు స్పష్టమైన అదేశాలు జారీ చేశారు.

బీమా చెక్కు అందజేత

కన్నేవలస గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రావాడ జగన్నాథరావు ఇటీవల జరిగిన ప్రమాదం లో మరణించాడు. అతడు టీడీపీ సభ్యత్వం తీసు కోవడంతో బీమా మంజూరు కావడంతో అతడి కు టుంబానికి రూ.5లక్షల చెక్కులను మంత్రి అంద జేశారు. రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్‌ మాజీ అధ్య క్షుడు హరివరప్రసాద్‌, టీడీపీ నాయకులు బోయిన సత్యశ్రీనివాస్‌, విజయలక్ష్మి, కామేశ్వరరావు, పట్ట సింహాచలం, రావాడ రాజేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:39 AM