నాణ్యత పాటించకపోతే చర్యలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:13 AM
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ చట్టం-2013 ప్రకా రం నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యు డు కాంతారావు హెచ్చరించారు. బుధవారం జంటపట్టణాల్లోని పౌరసరఫ రా డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేప ట్టారు. పలాసలోని ఎంఎల్‌సీ పాయింట్‌ను తనిఖీచేసిన ఆయన తూనిక యంత్రం పని చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
పలాసరూరల్,జనవరి7(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ చట్టం-2013 ప్రకా రం నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యు డు కాంతారావు హెచ్చరించారు. బుధవారం జంటపట్టణాల్లోని పౌరసరఫ రా డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేప ట్టారు. పలాసలోని ఎంఎల్‌సీ పాయింట్‌ను తనిఖీచేసిన ఆయన తూనిక యంత్రం పని చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్టాక్‌ను పరిశీ లించి రికార్డులను తనిఖీచేశారు.కాశీబుగ్గ పూజారివీధి,పల్లివీధిలో చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేసి లెడ్జర్ పుస్తకాలు,స్టాక్‌ను పరిశీలించారు. పల్లివీధి డిపోలో బోర్డు లేకపోవడంతో తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొగిలిపాడు అంగన్‌వాడీ కేంద్రంలో భోజన నాణ్యత లోపంపై ప్రశ్నించా రు. పలాస జడ్‌పీహైస్కూల్‌లో భోజన తయారీని పరిశీలించారు. .
ఇష్టం లేకపోతే తప్పుకో
టెక్కలి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఎలాగైతే టెండర్లు దక్కించుకున్నారో అదే రీతిలో కారగాయలు, సరుకులు సరఫరా చేయాలని, ఇష్టం లేకపోతే తప్పుకో వాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు తేల్చిచెప్పారు. బుధవారం టెక్కలిలోని మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించారు.కాంట్రాక్టర్ కారగాయలు, సరుకులు అరకొరా సరఫరా చేస్తుండ డం గమనించి ఆరాతీశారు. ఒప్పందం ప్రాప్తికి సరఫరా చేయాల్సిందేనని తెలిపారు. ఈ విషయాన్ని జేసీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.ఈసందర్భంగా ప్రిన్సిపాల్ పి.సుధారాణివివరాలు తెలియజేశారు. అలాగే సబ్ కలెక్టరేట్ దరి సమీకృత బాలికల వసతిగృహం, డిగ్రీ కళాశాల మైదానంలోగల బాలుర వసతిగృహాన్ని పరిశీలించారు. బీసీ బాలికల కళా శాల వసతి గృహం పరిశీలిచారు. అక్కడ నాసిరకం కూరగాయలు ఉండా న్ని గమనించి హెచ్‌డబ్ల్యూవోకు మెమె జారీచేయాలని అధికారులకు ఆదే శించారు. యన వెంట డీఎస్‌వో సూర్యప్రకాష్, ఫుడ్‌కమిటీ ఆఫీసర్ శ్రీరా ములు, తూనికలు, కొలతలు శాఖ ఇన్‌స్పెక్టర్ బలరామకృష్ణ, ఏబీసీ త్రినా ఽథరావు, డీటీ శరత్‌కుమార్ పాత్రో, హెచ్‌డబ్ల్యూవో విజయలక్ష్మి ఉన్నారు.