Share News

పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:49 PM

పట్టణ పరిధిలోని 23 వార్డులో చేపడుతున్న అభి వృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ హెచ్చరిం చారు.

పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలోని 23 వార్డులో చేపడుతున్న అభి వృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ హెచ్చరిం చారు. ఆదివారం పూజారిపేటలో పర్యటించి సీసీ కాలువల పనులను పరిశీలించారు. పనుల నాణ్యతను, పురోగతిని పర్యవేక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధా న్యం ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యా సాగర్‌, బగాది భాస్కరరావు, పీవీకే రాజు, మునిసిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:49 PM