Share News

పనుల్లో జాప్యం జరిగితే చర్యలు

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:53 PM

రైల్వే స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని వాల్తెరు డీఆర్‌ఎం లలిత్‌ బహోరా కోరారు.

పనుల్లో జాప్యం జరిగితే చర్యలు
అధికారులతో మాట్లాడుతున్న డీఆర్‌ఎం లలిత్‌ బహోరా

ఇచ్ఛాపురం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రైల్వే స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని వాల్తెరు డీఆర్‌ఎం లలిత్‌ బహోరా కోరారు. పనుల్లో జాప్యం జరి గినా, నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. గురువారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో రిజర్వేషన్‌ కౌం టర్‌, సాధారణ టికెట్‌ కౌంటర్‌, ఫ్లాట్‌పా రంలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రిజ్‌ పని చేయకపోవడంతో వెంటనే బాగుచేయాలని సూచించారు.ప్రయాణికులకు ఎటువంటి అసౌ కర్యం కలగుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్టేషన్‌ సమీపంలో గల ఎల్‌సీ గేటు వద్ద జరుగుతున్న ఆర్‌యూబీ పనుల గురించి అడిగితెలుసుకున్నారు. రైల్వేస్టేషన్‌లో మూడో ట్రాక్‌ లైన్‌, రైల్వే క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు తమకు ఆటో స్టాం డ్‌కు స్థలం కేటాయించాలని డీఆర్‌ఎంను కోరా రు. కాగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో ప్రయాణి కులకు సౌకర్యాలు మెరుగుపరచడంతోపాటు పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని బలగం ఫౌండేషన్‌ చైర్మన్‌, రైల్‌ యూజర్స్‌ కమిటీ సభ్యులు కాళ్ల జయదేవ్‌, బలివాడ రామారావు, సిద్దు, అవి నాష్‌, డి.గోపాలరావు, రమేష్‌, శ్రీరాం కోరారు. ఈ మేరకు ఇచ్ఛాపురంలో డీఆర్‌ఎం లలిత్‌ బహోరాకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Oct 08 , 2026 | 11:53 PM