Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:02 AM

నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అల్లర్లు, గొడవలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయనాయుడు హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
మాట్లాడుతున్న డీఎస్పీ ధనుంజయనాయుడు

శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయనాయుడు

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అల్లర్లు, గొడవలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయనాయుడు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్ని కల నేపథ్యంలో మంగళవారం నగరంలోని దమ్మలవీధిలో ప్రజలకు అవ గాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండా లన్నారు. గంజాయి వంటి మత్తు పదా ర్థాలను రవాణా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. రౌడీషీ టర్లు, పదే పదే తగాదాలు సృష్టించే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు లకు సహకరించాలని కోరారు. సీఐ పైడిపు నాయుడు, ఎస్‌ఐ హరికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:02 AM