Share News

ఎరువుల పంపిణీలో అక్రమాలు జరిగితే చర్యలు

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:57 PM

ఎరువుల పంపిణీలో అక్రమాలకు పాల్పడి రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు.

ఎరువుల పంపిణీలో అక్రమాలు జరిగితే చర్యలు
ఆన్‌లైన్‌లో ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

బూర్జ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఎరువుల పంపిణీలో అక్రమాలకు పాల్పడి రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. బూర్జ రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీని పరిశీలించి కౌలు రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు యాప్‌ ద్వారా బుక్‌ చేసుకు న్న ఎరువుల వివరాలు, గోదాములో ఉన్న నిల్వలు, పంపిణీ రిజిస్టర్లు, స్టాక్‌ వివరాలను కలెక్టర్‌ తనిఖీ చేశా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు పంపిణీ చేయాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా తగినంత నిల్వలో ఉందని, రైతులు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రువులు పంపిణీ సమయంలో రైతులు క్యూలైన్‌లో ఎక్కువ సేపు నిలబడాల్సిన పరిస్థితి రాకుండా సమర్ధవంతంగా పంపిణీ చేపట్టాలని సూచించారు. ఏవో ఉషారాణి, తహసీల్దార్‌ పద్మావతి, ఎంపీడీవో తిరుపతిరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 11:57 PM