Share News

అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:49 PM

నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని విజి లెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు హెచ్చరిం చారు.

అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే చర్యలు

విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు

రూ.5.94 లక్షల విలువైన 7,784 కిలోల బియ్యం, కందిపప్పు స్వాధీనం

శ్రీకాకుళం క్రైం/నరసన్నపేట, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని విజి లెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు హెచ్చరిం చారు. ఈ మేరకు శనివారం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి వివేకానంద ఆధ్వర్యంలో ఆమ దాలవలస, నరసన్నపేట ప్రాంతాల్లో పలు దుకా ణాలను తనిఖీ చేశారు. వెంకటేశ్వర్‌ రైస్‌షాప్‌, ప్రవీణ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ మార్కెట్‌, సాయికృష్ణ ట్రేడర్‌ తదితర దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలను అతిక్రమిం చిన నాలుగు దుకాణాలపై లీగల్‌ మెట్రాలజీ చట్టం కింద మూడు కేసులు నమోదు చేశారు. సాయిట్రేడర్స్‌పై నిత్యావసర సరుకుల చట్టం- 1955లోని సెక్షన్‌ 6 (ఏ) కింద మరో కేసు నమో దు చేశారు. రూ.5,94,004 విలువైన 7,7784 కిలోల బియ్యం, 20 కిలోల కందిపప్పు స్వాధీనం చేసుకు న్నారు. తూనికలు, కొలతల్లో అక్ర ూలకు పాల్ప డినా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ సీఐ సతీష్‌ కుమార్‌, ఎస్‌ఐ రామారావు, లీగల్‌ మెట్రాలజీ అధికారి బలరామకృష్ణ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:49 PM