Share News

అధిక ధరలకు సరకులు విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:01 AM

అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాపు యాజమానులకు విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు హెచ్చరించారు.

అధిక ధరలకు సరకులు విక్రయిస్తే చర్యలు
నరసన్నపేటలోని ఓ కిరాణాషాపులో తనిఖీచేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

నరసన్నపేట, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాపు యాజమానులకు విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు హెచ్చరించారు. నరసన్నపేటలోని వాసవి కృష ్ణకిరాణా జనరల్‌స్టోర్‌, ధనలక్ష్మి, వాసవి, ముకుంద, ఎస్‌వీఆర్‌, శ్రీనివాస, వెంకటేశ్వర కిరాణా షాపుల్లో విజిలెన్స్‌ డైరెక్టర్‌ హరీస్‌కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి వివేకానంద ఆధ్వర్యంలో గురువారం విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు విరుద్దంగా వ్యవహరించిన మూడు షాపులపై లీగల్‌ మెట్రోలజీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో విజలెన్స్‌ సీఐ సతీష్‌కుమార్‌, ఎస్‌ఐ రామారావు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 12:01 AM