Share News

ఎరువులు పక్కదారి పట్టిస్తే చర్యలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:44 PM

రైతుల ఈకేవైసీ ద్వారా ఎరువులు విక్రయించాలని, ఎరు వులు పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో సాయి ప్రత్యుష హెచ్చరించారు.

ఎరువులు పక్కదారి పట్టిస్తే చర్యలు
జేఆర్‌పురం ఎరువుల దుకాణంలో రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో సాయిప్రత్యూష

శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష

రణస్థలం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రైతుల ఈకేవైసీ ద్వారా ఎరువులు విక్రయించాలని, ఎరు వులు పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో సాయి ప్రత్యుష హెచ్చరించారు. మంగళవారం జేఆర్‌పురం, కొండ ములగాం లోని పలు ఎరు వుల దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఎరువుల ధరల పట్టికను ప్రదర్శించా లన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడీఏ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ సనపల కిరణ్‌ కుమార్‌, ఏవో భాస్కరరావు పాల్గొన్నారు.

‘రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులివ్వాలి’

ఇచ్ఛాపురం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ నిబంధనలకు అనుగుణంగా ఖరీఫ్‌లో రైతు లకు ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు అంద జేసేలా చర్యలు తీసుకోవాలని పలాస ఆర్డీవో ఆర్‌. అప్పలరాజు ఆదేశించారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో వ్యవసాయాధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోంపేట వ్యవసాయ డివిజన్‌లో అవసరమైన విత్తనాలు, ఎరువులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్‌ దుకా ణాల్లో కూడా పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ బి.నరసింహమూర్తి, తహసీల్దార్‌ ఎన్‌. వెంకటరావు, ఏవోలు అజయ్‌కుమార్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 11:44 PM