అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:07 AM
అక్రమార్కులపై చర్యలు తీసుకోవా లని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టంచేశారు. బుధవారం మునిసిప ల్ కార్యాలయంలో పలాస నియోజకవర్గంలోని తహసీల్దార్లు, కమిషనర్, మైన్స్, పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రోడ్డు కోసం చెరువునే కప్పేస్తున్నారు, వివాదాల భూములు, ఉజ్జుడుమెట్ట పాయే.. శీర్షికలతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలే ప్రధాన అంశంగా చర్చించారు.
పలాస, జనవరి 7(ఆంధ్రజ్యోతి): అక్రమార్కులపై చర్యలు తీసుకోవా లని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టంచేశారు. బుధవారం మునిసిప ల్ కార్యాలయంలో పలాస నియోజకవర్గంలోని తహసీల్దార్లు, కమిషనర్, మైన్స్, పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రోడ్డు కోసం చెరువునే కప్పేస్తున్నారు, వివాదాల భూములు, ఉజ్జుడుమెట్ట పాయే.. శీర్షికలతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలే ప్రధాన అంశంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంకర, మట్టి అక్రమ తవ్వకాలకు తావలేదని, వారి వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకో వాలని తహసీల్దార్లు, పోలీసులకు ఆదేశించారు.తాను చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తోందని తెలిపారు. అక్రమంగా మట్టి, కంకర తర లిస్తున్న వాహనాలు సీజ్‌చేయాలని, అవసమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమ తవ్వకాలపై వీఆర్వోల వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నా బయట పెట్టకపోవడాన్ని తప్పుబట్టారు. ఇక నుంచి ట్రాక్టర్ మట్టి తరలినా అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. పలాస డివిజన్‌లో కంకర తవ్వకాల క్వారీలకు అనుమతులు లేవని టెక్కలి మైన్స్ ఏడీ బి.విజయలక్ష్మి సభకు వివరించారు. సమావే శంలో కమిషనర్ ఇ.శ్రీనివాసులు, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, సీఐలు వై.రామకృష్ణ, తిరుపతి రావు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావుయాదవ్, ఎం.నరేంద్ర (చిన్ని), గాలి కృష్ణారావు, టంకాల రవిశంకర్‌గుప్తా పాల్గొన్నారు.
కలకలం రేపిన తహసీల్దార్ వ్యాఖ్యలు
మట్టి, కంకరపై తాము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కొన్ని ప్రాంతాల్లో తమకు ట్రాక్టర్‌తో గుద్దిస్తామని, ఫోన్‌లో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఈ సందర్భంగా పలాస తహసీల్దార్ టి.కళ్యాణ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దీనిపై మందస టీడీపీ నాయకుడు బి.దుర్యోధన మాట్లాడుతూ వారి పేర్లు బహిర్గతం చేయా లని కోరారు. దీంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభు త్వం వచ్చిన తర్వాత బెదిరింపు అనేది ఉండదని, ఈ వ్యాఖ్యలు వల్ల తమమనోభావాలు దెబ్బతింటాయన్నారు. దీంతో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు కలుగజేసుకొని ఇద్దరిని శాంతింపజేశారు. కాగా జంటపట్టణాల్లోని జగన్నాథసాగరం చెరువును ఆక్రమించి రోడ్డును వేస్తున్న వారిని గుర్తించి ఎమ్మెల్యేకు లిఖితపూర్వకంగా నివేదించినట్లు తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి తెలిపారు. ఈ మేరకు దీనిపై పోలీసులకు కేసు నమోదు చేయాలని వివరాలు ఇచ్చామన్నారు. కలెక్టర్ కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారని ఎమ్మెల్యే శిరీష వివరించారు.