మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:01 AM
మెనూ విషయంలో విఫలమైతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక డా. బి.ఆర్. అంబేడ్కర్ బాలికల గురుకులాన్ని సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. పరిశుభ్రత, వసతులు, తాగునీరు, వసతిగదుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థి నులతో మాట్లాడి వివరాలు సేకరిం చారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ భోజనం రుచికరంగా ఉండాలని, నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు.
పాతపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మెనూ విషయంలో విఫలమైతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక డా. బి.ఆర్. అంబేడ్కర్ బాలికల గురుకులాన్ని సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. పరిశుభ్రత, వసతులు, తాగునీరు, వసతిగదుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థి నులతో మాట్లాడి వివరాలు సేకరిం చారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ భోజనం రుచికరంగా ఉండాలని, నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు.
విజయమే లక్ష్యం కావాలి
స్థానిక ఎన్నికలలో విజయమే ధ్యేయంగా పని చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో పాతపట్నం పార్టీ శ్రేణులతో సోమవారం కాఫీ విత్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ, ఎస్.సతీష్, ఎ. సన్యాసిరావు, మధుబాబు, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండదండలు
కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులకు టీడీపీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. కొత్తూరు మండలం మెట్టూరుకు చెందిన మండూరు ప్రకాశరావు ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతిచెందారు. విద్యుత్ శాఖ మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. వెంకటాపురం, ద్వారకాపురం గ్రామాలలో ఉదికల పోలమ్మతల్లి, అభయాంజనేయ స్వామి ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.60లక్షల నిధులు మంజూరైనట్టు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం సంబంధిత పత్రాలను ఆ గ్రామాల నాయకులకు సోమవారం అందజేశారు.