Share News

సహజవనరులు కొల్లగొడుతున్న వారిపై చర్యలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:56 PM

సహజనవరులు కొల్ల గొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు.

 సహజవనరులు కొల్లగొడుతున్న వారిపై చర్యలు
మాట్లాడుతున్న గౌతు శిరీష:

పలాస, మార్చి 24(ఆంధ్రజ్యోతి): సహజనవరులు కొల్ల గొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. మంగళవారం ఆమె పలాస, వజ్రపుకొ త్తూరు, మందస మండలాల తహసీల్దార్లు, పోలీసు అధికారుల తో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్‌, మట్టి తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండలు పిండిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పగటిపూట అక్రమంగా గ్రావెల్‌తవ్వకాలు జరిపితే వాహనాలు పట్టుకొని మైనింగ్‌ శాఖకు వాటిని అప్పగించాలని కోరారు. రాత్రులు తవ్వకాలు జరిపితే వెంటనే వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేయాలని తెలిపారు. పట్టుబడిన ప్రతి వాహనంపై మైన్స్‌ చట్టంలో ఉన్న సెక్షన్‌ 80ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని పేర్కొన్నారు. అక్రమార్కులు మరోసారి తవ్వకాలు జరపకుండా భారీ మొత్తంలో జరిమానా విధిం చాలని సూచించారు. అక్రమ మైనింగ్‌కు ముగింపు పలకాలని, ఏ పార్టీ నాయకుడు చేసినా విడిచిపెట్టవద్దని కోరారు.

Updated Date - Mar 24 , 2026 | 11:56 PM