నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:36 PM
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
కోటబొమ్మాళి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం మండలంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, రహదారులు భవనాలు తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రహ దారులు, డ్రైనేజీల వ్యవస్థలు, ఇంటింటా తాగునీరు పథకం అమలులో ఎక్కడా అల సత్వం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమం లో టెక్కలి ఆర్డీవో ఎన్. కృష్ణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్ పాల్గొన్నారు. అలాగే తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలనుంచి వచ్చిన వినతులు పరిశీలించి సంబందిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ నందిగాం మండలాధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్ పాల్గొన్నారు.