Share News

నిబంధనలు పాటించని డీలర్లపై చర్యలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:47 PM

నిబంధనలు పాటించని రేషన్‌ డిపోల డీలర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు.

నిబంధనలు పాటించని డీలర్లపై చర్యలు
పాత శ్రీకాకుళం: పెద్దపాడులోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల స్టాక్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేస్తున్న కాంతారావు:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): నిబంధనలు పాటించని రేషన్‌ డిపోల డీలర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని పలు రేషన్‌ డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీచేశారు. తొలుత బలగలోని ఓ డిపోలో స్టాక్‌ తనిఖీ చేశారు. ఇక్కడ గోధుమపిండి, బెల్లం విక్రయించకపోవ డంపై చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. అనం తరం డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిపోలను పరిశీలించారు. న్యూకా లనీలోని డిపో మూసివేయడంతో డీలరుపై చర్యలకు ఆదేశించారు.గాజులవీధి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీచేసి హాజరుకాని వారిని రెడ్‌మార్క్‌తో గుర్తించాల ని, రికార్డులో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పీఎస్‌ఎన్‌ఎంపాఠశాలలో మధ్యాహ్నభోజన పథకాన్నిపరిశీలించారు.

ఫపాత శ్రీకాకుళం/ఎచ్చెర్ల, జనవరి6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆహారకమిషన్‌ సభ్యుడు కాంతా రావు హెచ్చరించారు. పెద్దపాడులోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గురుకుల విద్యాలయాల సంస్థ సమన్వయకర్త యశోధలక్ష్మి,ప్రిన్సిపాల్‌ కె.శ్రీని వాస్‌దేవి పాల్గొన్నారు. అలాగే ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ బాలికలగురుకుల పాఠశాల, కళాశాలలో మెస్‌,స్టోర్‌ రూమ్‌ను కాం తారావు పరిశీలించారు. తర్వాత కుప్పిలిలోని మోడల్‌ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట ప్రిన్సిపాల్‌ ఎస్‌.పద్మజ ఉన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:47 PM