సమష్టి కృషితోనే స్వచ్ఛాంధ్ర సాధన
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:23 PM
సమష్టి కృషితోనే స్వచ్ఛాంధ్రా సాధన సాధ్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.
జి.సిగడాం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితోనే స్వచ్ఛాంధ్రా సాధన సాధ్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. గురువారం జి.సిగ డాంలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 31 పంచాయతీలకు చెత్త సేకరణ ట్రైసైకిళ్లను గ్రీన్ అంబాసిడర్లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కుమరాపు రవికుమార్, వెంకటరమణ, కుదిరెళ్ల బుజ్జి, నక్క మురళీ, అర్జున్ కుమార్, అప్పన్న మాష్ఠారు, అప్పలనాయుడు, కూనుబిల్లి కూర్మా రావు, ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో సత్యనారాయణ పాల్గోన్నారు.
రైతులు మొక్కలు నాటాలి
రణస్థలం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రైతులు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. జేఆర్‌పురం పంచాయతీ సీతంవలసకు చెందిన పలువురు రైతుల పొలాల్లో ఎమ్మెల్యే పండ్ల మొక్కలు నాటారు.