‘పది’ పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:43 PM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీ ర్ణత సాధించాలని, ఈ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో కె.రవిబాబు అన్నారు.
డీఈవో రవిబాబు
ఇచ్ఛాఫురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీ ర్ణత సాధించాలని, ఈ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో కె.రవిబాబు అన్నారు. మండల పరిధి కొళిగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల, హరిపురం ఎంపీయూపీఎస్, బిర్లంగి ఎంపీపీ ఎస్, మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను బుధవారం తనిఖీ చేశా రు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీ లించారు. 100 రోజుల ప్రణాళిక, 30 రోజుల వెనుకబడిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్ర మంలో ఎంఈవోలు కె.అప్పారావు, ఎస్.విశ్వ నాఽథం, వార్డెన్ కాంతారావు పాల్గొన్నారు.
వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
కంచిలి పిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): టెన్త్‌లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డీఈవో రవిబాబు అన్నారు. బుధవారం ఎంఎస్‌పల్లి బీసీ హాస్టల్‌ను సందర్శించారు. అనం తరం విద్యార్థులతో మాట్లాడి సమయాన్ని వృథా చేయవద్దన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఎంఈవోలు శివరాం, ప్రసాద్, చిట్టిబాబు పాల్గొన్నారు.