Share News

జల్సాలకు అలవాటుపడి.. దొంగగా మారి

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:08 AM

చెడు వ్యసనాలకు బానిసై ఓ డిగ్రీ విద్యార్థి దొంగతనాలకు అలవాటుపడి పోలీసులకు పట్టుబడిన ఘటన మంగళవారం సంభ వించింది. కాశీబుగ్గ డీఎస్పీ భవాని విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు వెల్లడిం చారు. సోంపేట మండలం ఇస్కలపాలేనికి చెందిన వాసుపల్లి తాతారావు (20) బారువ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడి దొంగతనా లను వ్యసనంగా మార్చుకుని కవిటి, ఇచ్ఛాపురం, బారువలో ఏడు దొంగతనాలు చేశాడు. ఉదయం వేళ తెలిసిన వారి ఇళ్లనే టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడేవాడు.

జల్సాలకు అలవాటుపడి.. దొంగగా మారి

ఇచ్ఛాపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై ఓ డిగ్రీ విద్యార్థి దొంగతనాలకు అలవాటుపడి పోలీసులకు పట్టుబడిన ఘటన మంగళవారం సంభ వించింది. కాశీబుగ్గ డీఎస్పీ భవాని విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు వెల్లడిం చారు. సోంపేట మండలం ఇస్కలపాలేనికి చెందిన వాసుపల్లి తాతారావు (20) బారువ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడి దొంగతనా లను వ్యసనంగా మార్చుకుని కవిటి, ఇచ్ఛాపురం, బారువలో ఏడు దొంగతనాలు చేశాడు. ఉదయం వేళ తెలిసిన వారి ఇళ్లనే టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు, కవిటి పరిధిలో రెండు, బారువా పరిధిలో 3 కేసుల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది లొద్దపుట్టి జంక్షన్‌ వద్ద మంగళవారం తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పద స్థితిలో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ మేరకు సుమారు 16 తులాల బంగారం, రూ.39 వేల నగదు చోరీ చేశాడని, ఇలా దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు బరంపురం వెళుతుండగా తనిఖీలో పట్టుబడ్డాడని డీఎస్పీ తెలిపారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు, ఇతర గేమ్‌లు ఆడే అలవాటు ఉన్న తాతారావు డబ్బులు పొగొట్టుకోవడంతో చోరీలను అలవాటు చేసుకున్నాడన్నారు. నిందితుడు కేవలం జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్‌ అధి కారులు, సిబ్బందిని డీఎస్పీ భవాని అభినందించారు. సమావేశంలో సీఐ ఎం.చిన్నమనాయుడు, రూరల్‌ ఎస్‌ఐ జనార్దనరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:08 AM