నిందితుడికి మూడేళ్ల జైలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:01 AM
కాశీబుగ్గ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన నిందితుడికి మూడేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సోంపేట సబ్‌కోర్టు న్యాయాధి కారి జె.శ్రీనివాసరావు తీర్పు చెప్పినట్టు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ శుక్రవారం వేర్వేరుగా ప్రకటనల్లో పేర్కొన్నారు.
గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
వారిపైకే కంటైనర్‌ను వేగంగా తీసుకువెళ్లిన డ్రైవర్
శ్రీకాకుళం క్రైం/పలాస, జనవరి 30(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన నిందితుడికి మూడేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సోంపేట సబ్‌కోర్టు న్యాయాధి కారి జె.శ్రీనివాసరావు తీర్పు చెప్పినట్టు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ శుక్రవారం వేర్వేరుగా ప్రకటనల్లో పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. 2024 మార్చి 2న కాశీబుగ్గ హైవేపై ఓ కంటైనర్ (లారీ)లో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం రావడంతో అప్పటి ఎస్‌ఐ పి.పారినాయుడి సిబ్బందితో నెమలినారాయణ పురం వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఓ కంటైనర్‌ను ఆపేందుకు ప్రయ త్నించగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆలిఘర్ జిల్లా రాజావాల్ గ్రామానికి చెందిన కంటైనర్ డ్రైవర్ సుభాష్ భాగల్ వారిని గుద్దించుకుని ముందుకుపోయాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తప్పించుకుని ఆ కంటైన ర్‌ను వెంబడించి కొంతదూరం వెళ్లిన తర్వాత పట్టుకున్నారు. ఈ ఘటనపై అప్పటి కాశీబుగ్గ ఎస్‌ఐ పారినాయుడు కేసు నమోదు చేయగా.. సీఐలు దాడి మోహనరావు, విజయా నంద్, సూర్యనారాయణ దర్యాప్తు చేసి సాక్ష్యాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు వాదోప వాదనల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు సుభాష్‌కి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. కాగా ఈ కేసును పోలీసుల తరుఫున ప్రభుత్వ న్యాయవాది దువ్వు జగన్నా యకులు వాదించారు.