Share News

చోరీ కేసులో నిందితుడికి జైలు

ABN , Publish Date - May 12 , 2026 | 12:49 AM

శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ భవనం లో చోరీకి పాల్పడిన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ అదనపు జిల్లా సివిల్‌ న్యాయాధికారి కేఎం జమృత్‌ బేగం తీర్పునిచ్చారు.

చోరీ కేసులో నిందితుడికి జైలు

శ్రీకాకుళం క్రైం, మే 11(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ భవనం లో చోరీకి పాల్పడిన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ అదనపు జిల్లా సివిల్‌ న్యాయాధికారి కేఎం జమృత్‌ బేగం తీర్పునిచ్చారు. పోలీసుల కథనం మేరకు.. గత ఏడాది జనవరిలో శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ భవనంలో ఉన్న టీవీ, రూ.3500 నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై అప్పటి బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ యగళ్ల ప్రసన్న కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పాత నేరస్థుడు కలగ రాము దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనితో నిందితుడిని అరెస్టు చేసి... అతని నుంచి టీవీని స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడు కలగ రాముకు శిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు. ఈ కేసును శ్రీకాకుళం టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు దర్యాప్తు చేశారు. నిందితుడిపై గతంలో కూడా పలు దొంగతనాల కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

కానిస్టేబుల్‌ ఇంట్లో చోరీ

రణస్థలం, మే 11(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ కె.శ్రీను ఇంట్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి చొరబడి పుస్తెలతాడు, సెల్‌ఫోన్‌ చోరీకి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీను భార్య కె.లక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. శ్రీను ఉదయం 5 గంటలకు విధి నిర్వహణ నిమిత్తం ఎచ్చెర్ల పోలీస్‌ క్వార్టర్‌కు వెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి శ్రీను స్నేహితుడినని నమ్మబలికాడు. ఆయనకు నీళ్లు ఇచ్చేందుకు వంట గదికి వెళ్లివచ్చేసరికి బయట ఉంచిన పుస్తెలతాడు, సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. ఈ మేరకు బాధితు రాలు లక్ష్మి.. జేఆర్‌ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - May 12 , 2026 | 12:49 AM