పోక్సో కేసులో నిందితుడికి జైలు
ABN , Publish Date - May 23 , 2026 | 12:11 AM
జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి తీర్పు చెప్పినట్టు ఎస్‌ఐ ఎస్.చిరంజీవి శుక్రవారం తెలిపారు.
రణస్థలం/శ్రీకాకుళం లీగల్, మే 22 (ఆంధ్రజ్యోతి): జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి తీర్పు చెప్పినట్టు ఎస్‌ఐ ఎస్.చిరంజీవి శుక్రవారం తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు 2019లో ఓ గ్రామానికి చెందిన బాలికను టెక్కలికి చెందిన కోనేటి నవీన్ ప్రేమ పేరుతో వేధించేవాడు. బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి... తనను వివాహం చేసుకోకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించాడు.బాలిక అది తట్టుకోలేక చీమల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతరం బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో జేఆర్‌పురం ఎస్‌ఐ బి.అశోక్‌బాబు కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్‌ఐ ఇ.శ్రీనివాసరావు దర్యాపు చార్జిషీట్ దాఖలు చేశారు. బాధితురాలి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవీఎస్‌యూ విశాలాక్షి వాదనలు వినిపించారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయాధికారి ఎన్.సునీత నిందితుడు కోనేటి నవీన్‌కు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని చెప్పారు.