ప్రయాణికులకు వసతులు కల్పించాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:24 PM
మందస రోడ్(హరిపురం) రైల్వే స్టేషన్‌లో మౌలిక వసతులు కల్పించాలని హరిపురం, ఉద్దానం ప్రాంత ప్రజాప్రతినిధులు కొట్ర ఆనందరావు, గొలుసు చంద్రశేఖర్, రామారావు, వైకుంటరావు, హరి, దున్న పురుషోత్తం, రంగారావు రౌళో, లింగేశ్వరరావు, హరికృష్ణ, అమ్మినాయుడు కోరారు. ఈమేరకు ఇక్కడి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ హరిగోపాల్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు.
హరిపురం, జనవరి8 (ఆంధ్రజ్యోతి): మందస రోడ్(హరిపురం) రైల్వే స్టేషన్‌లో మౌలిక వసతులు కల్పించాలని హరిపురం, ఉద్దానం ప్రాంత ప్రజాప్రతినిధులు కొట్ర ఆనందరావు, గొలుసు చంద్రశేఖర్, రామారావు, వైకుంటరావు, హరి, దున్న పురుషోత్తం, రంగారావు రౌళో, లింగేశ్వరరావు, హరికృష్ణ, అమ్మినాయుడు కోరారు. ఈమేరకు ఇక్కడి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ హరిగోపాల్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఇక్కడి సమస్యలను ఖుర్థా రోడ్ జీఆర్‌ఎం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ వంతు కృషిచేయాలని విన్నవించారు.