స్పీడ్‌బ్రేకర్లు లేక ప్రమాదాలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:17 PM
మండలంలోని కురుడు పంచాయతీ పరిధిలోగల పాకివలసలో జాతీయరహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డులో స్పీడ్ర్‌బేకర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
కోటబొమ్మాళి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని కురుడు పంచాయతీ పరిధిలోగల పాకివలసలో జాతీయరహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డులో స్పీడ్ర్‌బేకర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామం మధ్యలో జాతీయరహదారి, రెండు పక్కల సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్ ఉన్నాయి. సర్వీస్ రోడ్డులో స్పీడ్‌గా వాహనాలు వస్తుండడంతోపాటు అదే సమయంలో ఫ్లైఓవర్ కింద నుంచి మరో సర్వీస్ రోడ్డులో నుంచి వాహనాలు ఒకేసారి రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. రెండు పక్కల ఉన్న సర్వీస్ రోడ్డులో ఫ్లైఓవర్ పక్కన స్పీడ్‌బ్రేకర్లు వేయాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన జాతీయరహదారుల ప్రాతికారసంస్థ అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డులో స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు.