వ్యవస్థాగత నిర్లక్ష్యాల వల్లే ప్రమాదాలు
ABN , Publish Date - May 21 , 2026 | 11:17 PM
: చిన్న చిన్న వ్యవస్థాగత నిర్లక్ష్యాల వల్లే రహదారులపై పెద్ద పెద్ద ప్రమా దాలు జరుగుతున్నాయని న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలి పారు.
శ్రీకాకుళం లీగల్, మే 21 (ఆంధ్ర జ్యోతి): చిన్న చిన్న వ్యవస్థాగత నిర్లక్ష్యాల వల్లే రహదారులపై పెద్ద పెద్ద ప్రమా దాలు జరుగుతున్నాయని న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలి పారు. గురువారం శ్రీకాకుళంలోని న్యాయ సేవాసదన్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల మేర కు సంబందిత అధికారులతో(స్టేక్ హోల్డ ర్లు) సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో రహదారు ల ప్రమాదాల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయిన నేపద్యంలో సుప్రీంకోర్టు రహదారుల ప్రమాదాలకు వ్యవస్థాగత నిర్లక్ష్యాలే కారణమని నిర్ధారించి కొన్ని మార్గదర్శకాలు సూచిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవె న్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ ఎన్.భాస్క రరెడ్డి, ఆర్టీవో ఎ.విజయ సారధి జాతీయ రహదారుల అధారిటీ అధికారి ప్రభాత్, కేవీ సురేష్, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్, పోలీసు అధికారి వి.రమేష్ పాల్గొన్నారు