Share News

ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:03 AM

ప్రజల సమస్యల సత్వర పరి ష్కా రానికి గాను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వ హించారు.

ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ
వినతులు స్వీకరిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే శంకర్‌

అర్జీదారుల సమస్యలు ఓపికగా విన్నకేంద్ర మంత్రి రామ్మోహన్‌, ఎమ్మెల్యే శంకర్‌

శ్రీకాకుళం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల సత్వర పరి ష్కా రానికి గాను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా నియోజక వర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తు న ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసు కువెళ్లారు. ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమ స్యలపై వినతిపత్రాలు అందజే శారు. అర్జీదారు లతో నేతలు స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్క సమస్యను ఓపిక గా విని వాటిపై అప్పటికప్పుడే సంబంధిత అధి కారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా పరి ష్కార మార్గాలు చూపుతామని ప్రజలకు భరో సా కల్పించారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే ఒకే వేదికపై అర్జీలు స్వీకరించడంపై దర్బార్‌కు హాజరైన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 29 , 2026 | 12:03 AM