Share News

పోర్టు పనులు వేగవంతం చేయండి

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:41 PM

మూలపేట పోర్టు పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఆదేశించారు. మంగళవారం మూల పేట పోర్టు పనులను పరిశీలించారు.

  పోర్టు పనులు వేగవంతం చేయండి
పోర్టు పనులు పరిశీస్తున్న కోన శశిధర్‌

సంతబొమ్మాళి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టు పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఆదేశించారు. మంగళవారం మూల పేట పోర్టు పనులను పరిశీలించారు. మూడు జనరల్‌ కార్గో బెర్త్‌లు, నీటిశుద్ధి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు 82 శాతం పనులు పూర్తయ్యాయని అక్కడి సిబ్బంది తెలి పారు. మౌలిక వసతుల వివరాలను అడిగితెలుసుకున్నారు. రైల్వే మార్గం పనులు పూర్తి చేయాల న్నారు. ఆయనతో పాటు మారిటైమ్‌ బోర్టు సీఈవో ప్రవీణ్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్‌ హేమసుందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:41 PM