అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: శంకర్
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:58 PM
నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు బుధవారం నియోజకవర్గస్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు బుధవారం నియోజకవర్గస్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజా ఫిర్యాదు లను ఎస్‌వోపీ నిబంధనల ప్రకారం త్వరిత గతిన పరిష్కరించాలన్నారు. సింహ ద్వారం, డేఅండ్ నైట్ జంక్షన్ రహదారి, నవభారత్ జంక్షన్-పెదపాడు రోడ్డు, పూసర్లపాడు, రోడ్డు విస్తరణ, కాలువల నిర్మా ణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విద్యుత్ స్తంభాల మార్పిడి, డీసీసీబీ కాలనీ, నెల్లమ్మకాలనీలో రూ.6.5 కోట్లతో చేపట్టిన కాలువల నిర్మాణం పూర్తిచేయాలన్నారు. సమావేశంలో నియోజక వర్గ ప్రత్యేకాధికారి జి.శ్రీధర్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ శ్రావణ్‌కుమార్, గార మండల ప్రత్యేకాధి కారి బాలకృష్ణ, శ్రీకాకుళం, గార తహసీల్దార్లు ఎస్.గణపతి, ఎం.చక్రవర్తి, ఎంపీడీవోలు వి.ప్రకా శరావు, ఎస్.శ్రీనివాసులు, నాలెడ్జ్ పార్ట్నర్ డాక్టర్ ప్రకాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.