శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:25 AM
: శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించా రు.
-టౌన్ ప్లానింగ్ సిబ్బంది వద్ద పట్టుబడిన నగదు
-భవన నిర్మాణ అనుమతులు, బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ ఆమోదాల్లో అక్రమాలు
శ్రీకాకుళం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించా రు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది వద్ద లెక్క ల్లోకి రాని నగదును గుర్తించారు. దీనికి సంబంధించిన మూలాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. భవన నిర్మా ణాల ప్లాన్ల అనుమతులు, బీపీఎస్ (బి ల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్), ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖా స్తుల ఆమోదంలో సబ్బంది భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆఽధారాలతో సహా గుర్తించారు. ఖాళీ స్థలాలకు పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) తదితర తప్పనిసరి రిజిస్టర్లను కూడా సిబ్బంది సరిగా నిర్వహించ డం లేదని, బిల్డింగ్ అప్రూవల్ కోసం ప్రజలు పెట్టుకున్న అనేక దరఖాస్తులను కావాలనే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టి ఇబ్బం దులకు గురి చేస్తున్నట్లు ఏసీబీ విచారణలో బయటపడింది. బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
అధికారులు లేదా సిబ్బంది పనుల కోసం లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్ 9440440057 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.