సముద్ర స్నానానికి వెళ్లిన యువతికి అస్వస్థత
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:27 AM
స్నానం కోసం సముద్రంలోకి దిగిన ఓ యువతి అలల తాకిడి తో ఆందోళనకు గురై ఉప్పు నీటిని తాగేసింది.
శివసాగర్ తీరంలో ఘటన
వజ్రపుకొత్తూరు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): స్నానం కోసం సముద్రంలోకి దిగిన ఓ యువతి అలల తాకిడి తో ఆందోళనకు గురై ఉప్పు నీటిని తాగేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఒడిశా రాష్ట్రం లావణ్య కోటకు చెందిన సునీనా పండా(22) బీటెక్ చదువు తోంది. ప్రస్తుతం ఆమె కుటుంబం పర్లాకిడిమిలో ని వాసం ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం సునీనా పండాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, మిత్రులు మొత్తం ఎనిమిది మంది శివసాగర్ తీరానికి వచ్చారు. కాసేపు తీరంలో సందడిగా గడిపారు. తర్వాత సము ద్రంలో స్నానానికి దిగారు. అలల ఉధృతికి వారంతా చెల్లాచెదురై ఒడ్డుకు కొట్టుకువచ్చారు. ఈ క్రమంలో సునీల పండా ఆందోళనకు గురై ఉప్పునీటిని తాగేయ డంతో తీవ్ర అస్వస్థకు గురైంది. స్థానికుల సమాచారం తో 108 వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకు న్నారు. సునీనా పండాకు ప్రథమ చికిత్స అందించి పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.