Share News

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:46 PM

పట్టణానికి చెందిన తెల్లి అవినాష్‌(23) ఆదివారం ఉదయం నూతిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
అవినాష్‌ (ఫైల్‌)

సోంపేట, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన తెల్లి అవినాష్‌(23) ఆదివారం ఉదయం నూతిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అవినాష్‌ సుమారు 18 నెలల కిందట బారువ నుంచి సోంపేట వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగింది. అనంతరం రెండుసార్లు ఆపరేషన్‌ జరిగినప్పటికీ సఫలం కాలేదు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం నూతిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ లోవరాజు తెలిపారు. మృతుడి తండ్రి యోగేశ్వరరావు కర్రల మిల్లు నడుపుతున్నారు. తల్లి గృహిణి. ఒక సోదరి కూడా ఉన్నారు. డిగ్రీ చదువుకున్న కుమారుడు ఇలా మృతి చెందడంపై తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 04 , 2026 | 11:46 PM