Share News

న్యూజిలాండ్‌ గడ్డపై రెపరెపలాడిన పసుపు జెండా

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:24 PM

ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం న్యూజిలాండ్‌ టీమ్‌ శుక్రవారం సాయంత్రం మహానాడును ఘనంగా నిర్వహించింది.

న్యూజిలాండ్‌ గడ్డపై రెపరెపలాడిన పసుపు జెండా
న్యూజిలాండ్‌ మహానాడులో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం న్యూజిలాండ్‌ టీమ్‌ శుక్రవారం సాయంత్రం మహానాడును ఘనంగా నిర్వహించింది. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు గరాపాటి మమత ఆధ్వర్యంలో ఈ కార్యక్ర మం జరిగింది. తొలత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళల ర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతిని ఐక్యం చేసిన టీడీపీ కుటుంబ సభలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గతంలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐలు చూపిన సంఘీభావం పార్టీకి ఎంతో బలాన్ని చ్చిందన్నారు. ఆంరఽధప్రదేశ్‌ ప్రజల మనోధైర్యం, పార్టీ కార్యకర్తల పోరాట స్ఫూర్తి కలిసి సైకో పరిపాలనకు ముగింపు పలికాయన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:24 PM