టీడీపీలోకి వలసల జోరు
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:05 AM
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి. వీరికి ఎమ్మెల్యేలు రవికుమార్, శంకర్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి. వీరికి ఎమ్మెల్యేలు రవికుమార్, శంకర్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
గోనెపాడులో వైసీపీ నుంచి 20 కుటుంబాలు టీడీపీలో చేరిక
సరుబుజ్జిలి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరిం చాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం గోనెపాడు గ్రామంలో పర్యటించారు. గత రెండున్నరేళ్లలో ఆమదాలవలస నియోజక వర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గోనెపాడు గ్రామంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. గొండు లక్ష్మణ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ పేడాడ రామ్మోహన్, టీడీపీ నాయకులు నూక కోటేశ్వరరావు, సనపల రాజు, నూక ప్రభాకర్, సనపల వెంకటరమణారావు, సింగురపు దివ్య రామచంద్రరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
గార, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తూలుగు పంచాయతీ చేకుల్లపేట, ఉప్పరపేట గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో వారికి ఎమ్మెల్యే గొండు శంకర్ పార్టీ కండు వాలను వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
జె.శాసనాం నుంచి 40 కుటుంబాలు..
కంచిలి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జె.శాసనాం పంచాయతీ వైసీపీ నేతలు సైని నాగేశ్వరరావు గొరకల దీనయ్య, జుత్తు కుమారస్వామితో పాటు 40 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం వారికి టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో రెయ్యి సోమేష్ పాల్గొన్నారు.
చిన్నలెంకపేట గ్రామం నుంచి..
రణస్థలం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రణస్థలం పంచాయతీ చిన్నలెంకపేట గ్రామం నుంచి పలువురు వైసీపీ నాయకులు ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారికి ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు పిన్నింటి భానోజీ నాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో వండాన రమణ, లంక సూర్యనారాయణ, కళావతి, రామారావు, నారాయణరావు, లంక కోటి, లంక శ్రీరామ్, లంక రమణ, లంక అప్పలనాయుడు, గురయ్యగారి అప్పలనాయుడుతో పాటు మరికొందరు చేరారు. కార్యక్రమంలో మజ్జి వెంకటరమణ తదితరులు ఉన్నారు.