Share News

సముద్రంలో మునిగిన లంగరు బోటు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:47 PM

ఇసకల పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు సవడాల డిల్లేసు, బైపల్లి కామరాజులకు చెందిన డబుల్‌ ఇంజన్‌ మోటార్‌ బోటు సము ద్రంలో మునిగి పోయిన ఘటన చోటుచేసుకుంది.

సముద్రంలో మునిగిన లంగరు బోటు
బోటును ఒడ్డుకు లాగుతున్న మత్స్యకారులు

సోంపేట రూరల్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఇసకల పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు సవడాల డిల్లేసు, బైపల్లి కామరాజులకు చెందిన డబుల్‌ ఇంజన్‌ మోటార్‌ బోటు సము ద్రంలో మునిగి పోయిన ఘటన చోటుచేసుకుంది. బాధితులు, మత్స్యశాఖ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ప్రతిరోజూ వేటలో భాగంగా మంగళవారం రాత్రి తీరం నుంచి అర కిలోమీటరు దూరంలో సముద్రంలో లంగరు వేశారు. బుధవారం వేకువజామున వేటకు బయలుదేరి చూసేసరికి లంగరు వేసి ఉంచిన చోట బోటు కనిపించలేదు. ఈ సమాచారం సముద్రంలో అప్పటికే వేటలో ఉన్న తోటి మత్స్యకారులకు తెలి పారు. ఆరు బోట్లు, తెప్పలతో మునిగిపోయిన బోటును గాలించారు. సదరు బోటు లంగరు వేసిన చోటునే మునిగిపోయినట్టు గమనించి అక్కడ ఉన్న మత్స్యకా రుల సహకారంతో బోటును ఒడ్డుకు చేర్చారు. ఎఫ్‌డీవో రవికుమార్‌కు బాధితులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీ లించారు. సాంకేతిక కారణాల వల్ల బోటు ఉన్న ఇంజిన్లు, వలలు, సము ద్రంలో గల్లంతైనట్టు గుర్తించారు. సుమారు రూ.8 లక్షలు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. మత్స్యకారులను కలిసి బోటు మునిగి పోయిన తీరును, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉన్న తాధికారులు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

Updated Date - Feb 18 , 2026 | 11:47 PM