Share News

ఎయిర్‌పోర్టుకు ముందడుగు

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:12 AM

Farmers ready to hand over lands for the airport పలాస నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన ఏయిర్‌పోర్టుకు అవసరమైన భూములను ఇచ్చేందుకు బిడిమి, బహడాపల్లి, భేతాళపురం, రాంపురం, లక్ష్మీపురం, గంగువాడ గ్రామాల రైతులు సుముఖం వ్యక్తం చేశారు.

ఎయిర్‌పోర్టుకు ముందడుగు
పలాస ఆర్డీవో కార్యాలయం ఆవరణలో రైతులతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎమ్మెల్యే గౌతు శిరీష

భూములు ఇచ్చేందుకు ఆరు గ్రామాల రైతులు సిద్ధం

కలెక్టర్‌, ఎమ్మెల్యే సమక్షంలో అంగీకారం

పలాస రూరల్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన ఏయిర్‌పోర్టుకు అవసరమైన భూములను ఇచ్చేందుకు బిడిమి, బహడాపల్లి, భేతాళపురం, రాంపురం, లక్ష్మీపురం, గంగువాడ గ్రామాల రైతులు సుముఖం వ్యక్తం చేశారు. పలాస ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గౌతు శిరీష, జేసీ ఫర్మాద్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవో అప్పలరాజు సమక్షంలో రైతుల భూములకు నష్ట పరిహారం, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై చర్చించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సహకరిస్తామని, తమ భూములు ఇచ్చేందుకు సిద్ధమని రైతులు అంగీకారం తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ రైతుల సుముఖంతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ముందడుగు పడిందన్నారు. ఇదే స్ఫూర్తితో భావితరాల భవిష్యత్తు అభివృద్ధి కోసం మిగతా రైతులు కూడా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మందస మండలం ఆరు గ్రామాలకు చెందిన రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:12 AM