Share News

విద్యార్థి దశ నుంచే సేవాభావం’

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:05 AM

విద్యార్థి దశ నుంచే సేవా భావం అలవరచుకోవాలని జిల్లా మేరా యువ భార త్‌ అధికారి కృష్ణ అన్నారు.

విద్యార్థి దశ నుంచే సేవాభావం’

ఎచ్చెర్ల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే సేవా భావం అలవరచుకోవాలని జిల్లా మేరా యువ భార త్‌ అధికారి కృష్ణ అన్నారు. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ (ఎస్‌ఎంపురం)లో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో మేరా యువ భారత్‌ సహకా రంతో వికసిత్‌ భారత్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ప్రజలకు సేవచేసే అవకాశం ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా లభిస్తుందన్నారు. క్యాంపస్‌ డైరెక్టర్‌ ఎం. గిరిధర్‌ మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్‌ సేవా గుణాన్ని పెంపొందించి సమా జసేవకు విద్యార్థులను ప్రేరేపిస్తుందన్నారు. క్విజ్‌ పోటీలో 800 మంది విద్యార్థులు పాల్గొ న్నారు. కార్యక్రమంలో ఏవో శివరామకృష్ణ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ వాసు, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఈశ్వరరావు, వెల్ఫేర్‌ డీన్‌లు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:05 AM