Share News

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:49 PM

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు 60 మార్కులతో ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సం ఘం (ఏపీయూస్‌) రాష్ట్ర అధ్య క్షుడు ఎస్‌.బాలాజీ డిమాండ్‌ చేశారు.

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి
మాట్లాడుతున్న ఏపీయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ

ఏసీయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ

ఇచ్ఛాపురం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు 60 మార్కులతో ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సం ఘం (ఏపీయూస్‌) రాష్ట్ర అధ్య క్షుడు ఎస్‌.బాలాజీ డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణం లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్లో సంఘ సమా వేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెట్‌ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యా యులు ఆందోళనకు గురవుతున్నార న్నారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా ప్రభావిత ఉపా ధ్యాయులకు రక్షణ కల్పించేలా చర్యలు చేప ట్టాలని కోరారు. ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్‌ నిర్వహించి ఇన్‌-సర్వీస్‌ ఉపాఽధ్యాయులకు 60 మార్కులను ఉత్తీర్ణతగా ప్రకటించి న్యాయం చేయాలన్నారు. ఉపాధ్యా యుల సేవా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల న్నారు. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌కు అనుగుణంగా లోకల్‌ క్యాడర్‌ ఆర్గనైజేషన్‌ చేపట్టాలని, జీఓ నెం.253 రద్దు చేసి జూనియర్‌ లెక్చరర్‌ ప్రమో షన్లు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి చలపతిరావు, రాష్ట్ర గౌరవ సలహా దారు ఆనందరావు, జిల్లా అధ్య క్షుడు దుప్పల శివరాంప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి కీలు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:49 PM