Share News

సమకాలీన పరిణామాలకు అనుగుణంగా పాట

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:40 PM

సమకాలీన పరిణామాలకు అనుగు ణంగా పాటలను రాయాల్సిన అవసరం కవులపై ఉందని ప్రముఖ విద్యావేత్త, ఆచార్య కె.చలం అన్నారు.

సమకాలీన పరిణామాలకు అనుగుణంగా పాట
పుస్తకావిష్కరణ చేస్తున్న ఆచార్య చలం తదితరులు

విద్యావేత్త ఆచార్య కె.చలం

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సమకాలీన పరిణామాలకు అనుగు ణంగా పాటలను రాయాల్సిన అవసరం కవులపై ఉందని ప్రముఖ విద్యావేత్త, ఆచార్య కె.చలం అన్నారు. ఆదివారం ఎన్జీవో హోంలో కవి, రచయిత నల్లి ధర్మారావు రచించిన ‘మౌనమిప్పుడు పగిలిపోని’ పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కళింగాంద్రుల జానపద సంపదగా పాటను అభివర్ణించారు. శ్రమ జీవులు సృష్ణించిన పాటను వ్యాపారం చేసి పలు వురు లబ్ధిపొందడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడు తూ.. తెలం గాణ, ఆంధ్ర ప్రజా ఉద్యమ సాహిత్యానికి గద్దర్‌, వంగపండు రెండు కళ్లులాంటివారని, గద్దర్‌ మృతి చెందిన తరువాత తెలంగాణ ప్రభు త్వం ఆయన పేరుతో సినీ అవార్డులను ప్రకటించిందన్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం వంగపండును విస్మరించిం దన్నారు. వంగ పండు పేరుతో ఆంధ్రా యూనివర్సిటీలో జానపద సాహిత్య కళాపీఠం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్జీజీవో నాయకులు చౌదరి పురుషో త్తంనాయుడు, హనుమంతు సాయిరాంతో పాటు దుప్పల రవీంద్రబాబు, గంట్యాడ గౌరునాయడు, ఉప్పల అప్పలరాజు, కేతవరపు శ్రీనివాసరావు, బొడ్డేపల్లి మోహనరావు, కూన అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వంగపండు దుష్యంత్‌, డప్పు శ్రీను, కోరాడ ఈశ్వరరావు, చింతాడ రామచంద్రరావు, ఉద్దానం సూధన్‌ ఆల పించిన ప్రజా గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Updated Date - Sep 06 , 2026 | 11:40 PM