దూడల ఉత్పత్తిపై లఘు చిత్రం
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:53 PM
రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి గోకుల్ మిషన్ సహకారంతో పెయ్యిదూడల ఉత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కోటబొమ్మాళి/ టెక్కలి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి గోకుల్ మిషన్ సహకారంతో పెయ్యిదూడల ఉత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదిన ప్రసాదరావు స్వీయరచన, దర్శకత్వంలో పెయ్యిదూడల ఉత్పత్తి పథకంపై రూపొందించిన లఘు చిత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వీర్యాన్ని రూ.1,300 ఖరీదుకు గాను కేవలం రూ.150లకే రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. అనంతరం పలు జాతీయ, రాష్ట్రీయ అవార్డులు అందుకున్న ప్రసాదరావును ఈ సందర్భంగా అభినందించారు. అలాగే టెక్కలి నియోజకవర్గానికి చెందిన 17మంది లభ్ధిదారులకు రూ.14లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, పీఏసీస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.