Share News

కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో..

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:12 AM

అనుమతి లేకుండా కలెక్టరేట్‌కు కూతవేటు దూ రంలో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.

కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో..
సీజ్‌ చేసిన వాహనాల వద్ద మైన్స్‌ అధికారులు

  • నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు

  • ట్రాక్టర్‌, ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసిన అధికారులు

  • రీచ్‌కు అనుమతి ముగిసినా యథేచ్ఛగా తరలింపు

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా కలెక్టరేట్‌కు కూతవేటు దూ రంలో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ఇక్కడ రీచ్‌ కు గత ఏడాది డిసెంబరుతో అనుమతుల గడువు ముగిసినా అఽధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొం దరి ఫిర్యాదుతో మైన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సి.మో హనరావు తనిఖీలు గురువారం చేపట్టారు. ఇదే సమయంలో ఇసుకను తరలించేందుకు ఉన్న ట్రా క్టర్‌తో పాటుగా ఎక్స్‌కవేటర్‌ సీజ్‌ చేశారు. డీడీ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని విలీన పంచాయతీలు కిల్లిపాలెం, కును కుపేట సరిహద్దులో కొత్త కలెక్టర్‌ కార్యాలయం వెనుక నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాల పై ఫిర్యాదు వచ్చింది. దీంతో గురువారం డీడీతోపాటు మైన్స్‌ ఆర్‌ఐ కె.మాణి క్యాలరావు మైన్స్‌ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తనిఖీ నిర్వహించారు. ఇసు క లోడ్‌ చేస్తున్న ఎక్స్‌కవేటర్‌తోపాటు ట్రాక్టర్‌ పట్టు బడింది. ఈ విషయాన్ని రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందికి సమా చారం ఇచ్చారు. వారు చేరుకుని వా టిని స్టేషన్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. గత ఏడాది డిసెంబ రుతో ఈ రీచ్‌ నిర్వహణకు అనుమతులు ముగిశాయి. అయినా ఇసుక తవ్వకా లు జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 10 , 2026 | 12:12 AM