Share News

ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత భవిష్యత్‌

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:18 AM

ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత భవిష్యత్‌ సాధ్య మని ఆర్‌బీఐ అధికారి రామకృష్ణ తెలిపారు.

ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత భవిష్యత్‌
మాట్లాడుతున్న రామకృష్ణ :

ఎచ్చెర్ల, జూలై1(ఆంధ్రజ్యోతి): ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత భవిష్యత్‌ సాధ్య మని ఆర్‌బీఐ అధికారి రామకృష్ణ తెలిపారు. బుధవారం మండలంలోని అల్లిన గరం జడ్పీ ఉన్నత పాఠశాలలో అప్‌లిప్ట్‌ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక అక్షరా స్యతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పొదుపు, బ్యాంకు వినియోగం, పెట్టుబడుల ప్రాధాన్యం, ఆర్‌బీఐ మార్గదర్శకాలు, డిజిటల్‌ లావా దేవీల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, సైబర్‌ నేరాల నుంచి రక్షణ పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్‌ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:18 AM