Share News

జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

ABN , Publish Date - May 17 , 2026 | 11:34 PM

జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిం చి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు.

జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.తులసీదాస్‌

అరసవల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిం చి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సుందరయ్య భవన్‌లో సీపీఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఒకవైపు తీరప్రాంతం, మరోవైపు కొండల్లో విస్తారంగా జీడి పండుతోందని, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు దళారుల దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జీడి కి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డును ఏర్పాటు చేస్తామని ము ఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినా నేటికీ అమ లు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కోనారి మోహనరావు, నాయకులు పి.తేజేశ్వరరావు, పోలాకి ప్రసాదరావు, అమ్మన్నాయుడు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 07:54 AM