తిమడాం వాసికి అరుదైన గౌరవం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:37 AM
గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొనేందుకు జలుమూరు మండలం తిమడాం గ్రామానికి చెందిన కణుసు శ్రీనివాసరావుకు అవకాశం కలిగింది.
గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొనే అవకాశం
నరసన్నపేట/ జలుమూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొనేందుకు జలుమూరు మండలం తిమడాం గ్రామానికి చెందిన కణుసు శ్రీనివాసరావుకు అవకాశం కలిగింది. ఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఎట్‌హోమ్ కార్యక్రమం ద్వారా గవర్నర్ గణతంత్ర దినోత్సవం రోజున విందు ఇస్తారు. శ్రీనివాసరావు రక్తదానం, ప్లాంటేషన్, యాంటీ డ్రగ్స్, స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో ఎంపికైనట్టు శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనివాసరావు ప్రస్తుతం కడప జిల్లాలో యోగివేమన విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు తండ్రి సూర్యనారాయణ రిటైర్డు టీచర్, తల్లి కమల గృహిణి. గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొనే అవకాశం శ్రీనివాసరావుకి రావడంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ బెల్లంకొండ రాజశేఖర్ అభినందించారు.