Share News

ఇచ్ఛాపురం వాసికి అరుదైన గౌరవం

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:53 PM

భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ ఎఫైర్స్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన ‘మై భారత్‌ బడ్జెట్‌ క్వెస్ట్‌’ పోటీల్లో ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన తరుణ్‌రాజ్‌ ప్రతిభ కనబరిచాడు.

ఇచ్ఛాపురం వాసికి అరుదైన గౌరవం
‘బడ్జెట్‌ క్వెస్ట్‌’లో తరుణ్‌రాజ్‌ను అభినందిస్తున్న నిర్వాహకులు

‘మై భారత్‌ క్వెస్ట్‌’లో రాణించిన తరుణ్‌ రాజ్‌

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ ఎఫైర్స్‌ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన ‘మై భారత్‌ బడ్జెట్‌ క్వెస్ట్‌’ పోటీల్లో ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన తరుణ్‌రాజ్‌ ప్రతిభ కనబరిచాడు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ఈపోటీలకు 200 మంది తుది పోటీలకు అర్హత సాధించారు. వీరిలో తరుణ్‌రాజ్‌ ఒకరు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, మాండవీయ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో తరుణ్‌రాజ్‌ రెండు రోజుల పాటు ఇచ్చిన సెమినార్‌ ఆకట్టుకుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో తరుణ్‌రాజ్‌ సూచించిన ఆర్థిక అంశాలను త్వరలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపినట్లు తరుణ్‌రాజ్‌ తెలిపాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తరుణ్‌రాజ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు అభినందించారు.

Updated Date - Apr 14 , 2026 | 11:53 PM