Share News

అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:38 PM

కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కుమా రుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మండలంలోని సరియాపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

 అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు
లోకేశ్వరరావు మృతదేహం

- విద్యుదాఘాతంతో యువకుడి మృతి

- కన్నీమున్నీరవుతున్న తల్లిదండ్రులు

పలాస, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కుమా రుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మండలంలోని సరియాపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పెద్దనారాయణపురం గ్రామానికి చెందిన మురపాక శాంతారావు, కాంతమ్మ కు లోకేశ్వరరావు(30)తో పాటు ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, లోకేశ్వరరావు చిన్నచిన్న ఎలక్ట్రికల్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సరియాపల్లిలో బోరు మోటారును బాగు చేసేందుకు వెళ్లాడు. మోటారును బయటకు తీసి బాగు చేద్దామనుకున్న సమయంలోనే విద్యుత్‌ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్క కొడుకు మృతి చెందడంతో తమకు ఇక ఎవరు దిక్కంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 03 , 2026 | 11:38 PM