అ‘పూర్వ’ సమ్మేళనం
ABN , Publish Date - May 10 , 2026 | 11:51 PM
జిల్లాలోని పలు పాఠశాల ల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఆయా పాఠ శాలల్లో జరిగింది. దూసి జడ్పీ హైస్కూల్‌లో 1994 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఆమదాలవలస, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు పాఠశాల ల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఆయా పాఠ శాలల్లో జరిగింది. దూసి జడ్పీ హైస్కూల్‌లో 1994 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 32 ఏళ్ల తర్వాత ఒకేచోట చేరిన వారంతా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందం పొందారు. మాతృ దినోత్స వం రోజున ఈ ఆత్మీయ సమావేశం జరగడం ఆనందం గా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాలకృష్ణ, పొన్నాడ రామారావు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
కరజాడ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు..
మెళియాపుట్టి, మే 10(ఆంధ్రజ్యోతి): కరజాడ జడ్పీ హైస్కూల్‌లో 2007-08 విద్యా సంవత్సరంలో పదో తర గతి చదివిన విద్యార్థుల ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుం టూ ఆటపాటలతో సందడి చేశారు. ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యా ర్థులు ఎల్.వెంకటాచలం, దీన బంధు, ఎస్.లక్ష్మణరావు, జగ దీష్, సింహాచలం, మణి కంఠ, జీవన్, పాత్రో తదితరులు పాల్గొన్నారు.
తెంబూరులో..
పాతపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): తెంబూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2015-16 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. సుమారు 45 మంది విద్యార్థులు పాల్గొని సందడిగా గడిపారు. ఈ సందర్భంగా అప్పటి హెచ్‌ఎం బి.వామనమురళితోపాటు ఉపాధ్యాయులను సత్కరిం చారు. సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. అప్పటి ఉపాధ్యాయుల్లో మృతిచెందిన పీఈటీ గంగరాపు రమేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.