తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:41 PM
సుమారు 1200 పైగా రసా యన సమ్మేళన ఫార్ములాలు రాయడం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన ఉన్నత పాఠశాల విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ శనివారం అభినందించారు.
విద్యార్థినులను అభినందించిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్
సోంపేట, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సుమారు 1200 పైగా రసా యన సమ్మేళన ఫార్ములాలు రాయడం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన ఉన్నత పాఠశాల విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ శనివారం అభినందించారు. 6వ తరగతి విద్యార్థినులు కర్రి శరణ్య, ఇంటివెనుక నారీమణి, పొందర సాయిశ్రీ, పట్నాన జోషిక, అల్లాడ రాజ్యలక్ష్మితో పాటు గైడ్ టీచర్ ఈశ్వరరావుకు గుర్తింపు పత్రాలు, షీల్డ్, మెడల్స్‌ను ఇచ్చి అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బి.మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.