Share News

రైలులో భయంగా ఉందని ఫోన్‌..

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:55 PM

Suspicious death of a young woman from Assam ‘నా బోగీలో అందరూ మగవాళ్లే ఉన్నారు. చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో’ అంటూ రైలులో ప్రయాణిస్తుండగా స్నేహితురాలికి ఫోన్‌ చేసిన ఆసాం యువతి బోర్‌ హిమశ్రీ (23) మూడు రోజుల తర్వాత పెనుబర్తి సమీపంలో శవమై కనిపించింది. రైలులో నుంచి జారిపడి ఆమె మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ ఘటనపై జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి గురువారం దర్యాప్తు చేశారు.

రైలులో భయంగా ఉందని ఫోన్‌..
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఇతర అధికారులు

మూడు రోజుల తర్వాత మృతదేహం

అసోం యువతి అనుమానాస్పద మృతి

దర్యాప్తు చేపట్టిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

పొందూరు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ‘నా బోగీలో అందరూ మగవాళ్లే ఉన్నారు. చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో’ అంటూ రైలులో ప్రయాణిస్తుండగా స్నేహితురాలికి ఫోన్‌ చేసిన ఆసాం యువతి బోర్‌ హిమశ్రీ (23) మూడు రోజుల తర్వాత పెనుబర్తి సమీపంలో శవమై కనిపించింది. రైలులో నుంచి జారిపడి ఆమె మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ ఘటనపై జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి గురువారం దర్యాప్తు చేశారు. అసోం రాష్ట్రం గౌహతికి చెందిన హిమశ్రీ విశాఖపట్నంలో డాన్సర్‌గా పనిచేస్తోంది. పరీక్షల నిమిత్తం మూడు రోజుల క్రితం వివేకా ఎక్స్‌ప్రెస్‌లో గౌహతికి బయలుదేరింది. తనకు రిజర్వేషన్‌ కాలేదని, బోగీలో అందరూ మగవాళ్లే ఉన్నారని, చాలా భయంగా ఉందని గౌహతిలో ఉన్న తన స్నేహితురాలు జ్యోతికి ఫోన్‌లో తెలిపింది. దీంతో ఆమె స్నేహితులు రైల్వే ఫిర్యాదు నెంబర్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గురువారం ఉదయం పెనుబర్తి సమీపంలో అటుగా వెళ్తున్న మహిళలకు హిమశ్రీ మృతదేహం కనిపించింది. వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి ఉండొచ్చని, అయితే పూర్తిస్థాయి దర్యాప్తు చేసి మృతికి గల కారణాలను నిర్ధారిస్తామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ ఎస్పీతో డీఎస్పీ రాజేంద్రనాయుడు, రైల్వే డీఎస్పీ ప్రమోద్‌, పొందూరు ఎస్‌ఐ రాజేష్‌, రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:55 PM