Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:00 AM

విజయనగరం జిల్లా పూసపాటిరేగ పరిధి కందివలస జాతీ య రహదారి వంతెనపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లాడి శేఖర్‌ (35) మృతి చెందగా రాజ్‌కుమార్‌ కు గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రమాదానికి గురైన బైక్‌

మరొకరికి గాయాలు

రణస్థలం/పూసపాటిరేగ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా పూసపాటిరేగ పరిధి కందివలస జాతీ య రహదారి వంతెనపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లాడి శేఖర్‌ (35) మృతి చెందగా రాజ్‌కుమార్‌ కు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవ లస మండలం మెట్టక్కివలస గ్రామా నికి చెందిన శేఖర్‌, రాజ్‌కుమార్‌ శుభ కార్యం నిమిత్తం కార్డులు పంచుకుని ఎస్‌కోట నుంచి స్వగ్రామం ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వైపు వస్తుండగా బైక్‌ అదుపు తప్పి రోడ్డుపై పడిపో యారు. ఈ ప్రమాదంలో శేఖర్‌ అక్కడి కక్కడే మృతి చెందగా.. గాయపడిన రాజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం శ్రీకా కుళం రిమ్స్‌కు తరలించారు. జేఆర్‌పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:00 AM