స్వాగత ద్వారాన్ని బైక్ ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:56 AM
అరసవల్లి సమీపంలోని అసిరితల్లి అమ్మవారు ఆలయం వద్ద రథసప్తమి పురస్కరించుకుని తాత్కా లికంగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి ద్విచక్రవాహనం ఢీకొని ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు.
శ్రీకాకుళం రూరల్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సమీపంలోని అసిరితల్లి అమ్మవారు ఆలయం వద్ద రథసప్తమి పురస్కరించుకుని తాత్కా లికంగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి ద్విచక్రవాహనం ఢీకొని ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. అరసవల్లి ఆదిత్య నగర కాలనీకి చెందిన కోట తవుడు(55) వప్పంగి నుంచి శ్రీకాకుళం వైపు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ రహదారిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్వాగత ద్వారాన్ని ఢీకొనడంతో వాహన చోదకుడు తవుడు మృతి చెందగా వెనుక కూర్చొన్న ప్రసాద్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తవుడు కుమారుడు కోట సంతోష్‌కుమార్ ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ ఏఎస్‌ఐ భుజంగరావు కేసు నమోదు చేశారు.