వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:11 AM
అక్కయ్యవలస గ్రామానికి చెందిన గుట్ల అచ్చెన్న(45) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కోటబొమ్మాళి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): అక్కయ్యవలస గ్రామానికి చెందిన గుట్ల అచ్చెన్న(45) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు.. అచ్చెన్న మద్యానికి బానిస య్యాడు. ప్రతి రోజూ తాగి వచ్చి తండ్రి, భార్య సుశీల తో గొడవ పడేవా డు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి గొడవపడడంతో మందలిం చారు. దీంతో క్షణికావే శానికి గురైన అచ్చెన్న బీరపాదుల కోసం తీసుకువచ్చిన పురుగుల మందును తాగేశాడు. దీన్ని గమనించిన భార్య, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యా హ్నం మృతి చెందాడు. అచ్చెన్నకు భార్య సుశీల, కుమారుడు మహేష్, కుమార్తె ఢిల్లేశ్వరి ఉన్నారు. తండ్రి శిమ్మన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్టు ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు.
కనిమెట్టలో యువకుడు..
పొందూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కనిమెట్ట ఎస్సీ కాలనీకి చెందిన కడుపూరి శ్రావణ్‌కుమార్ (32) కుటుంబ కారణాలతో గురువారం ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రావణ్‌కుమార్ భార్య కొంతకాలం కిందట రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. దీంతో ఆమె ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. దీనికితోడు తండ్రి పక్షవాతానికి గురయ్యాడు. దీంతో శ్రావన్‌కు మార్‌పై ఆరోగ్య, ఆర్థిక పరమైనసమస్యలతో ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంటిలో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. పంచ నామా నిర్వ హించి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నరసన్నపేట, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పాముకాటుతో చికిత్స పొందుతూ గురువారం మడపాం గ్రామానికి చెందిన పిన్నింటి రమణ (50) మృతిచెందినట్లు ఎస్‌ఐ-2 శేఖరరావు తెలిపారు. ఈనెల 19న పొలానికి నీరు కట్టేందుకు వెళ్లిన రమణ పాము కాటుకు గుర య్యాడు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్టు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.