వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:08 AM
మెంటాడ గ్రామానికి చెందిన ఎస్.సూరి రెడ్డి (33) పురుగుల మందుతాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రణస్థలం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మెంటాడ గ్రామానికి చెందిన ఎస్.సూరి రెడ్డి (33) పురుగుల మందుతాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సూరిరెడ్డి ప్రతిరోజూ మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. శనివారం కూడా మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో వ్యవసాయం కోసం ఇంటి వద్ద ఉంచిన పురుగుల మందును తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని చికిత్స నిమిత్తం కొండములగాం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సూరిరెడ్డి మృతి చెందాడు. ఈయనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకా